రెండు రోజుల్లో అన్ని విషయాలపై స్పష్టత: వై.ఎస్. షర్మిల

By narsimha lodeFirst Published Jan 2, 2024, 1:31 PM IST
Highlights

కాంగ్రెస్‌లో చేరిక విషయమై  వై.ఎస్. షర్మిల పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. వైఎస్ఆర్‌టీపీ నేతలతో  షర్మిల ఇవాళ సమావేశమయ్యారు.


హైదరాబాద్: అన్ని విషయాలపై  ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని  యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధినేత వై.ఎస్.షర్మిల ప్రకటించారు.వైఎస్ఆర్‌టీపీ  నేతలతో  వై.ఎస్. షర్మిల మంగళవారం నాడు హైద్రాబాద్ లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు.  కాంగ్రెస్‌లో చేరికపై  వై.ఎస్. షర్మిల పార్టీ నేతలకు  స్పష్టత ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీలో  కీలక పదవులు దక్కనున్నట్టుగా పార్టీ నేతలకు  షర్మిల  సమాచారం ఇచ్చారు. వై.ఎస్.షర్మిలకు  సీడబ్ల్యూసీ, ఎఐసీసీలో  కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని వైఎస్ఆర్‌టీపీ నేతలు చెబుతున్నారు. 

also read:న్యూఢిల్లీకి వై.ఎస్. షర్మిల: కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్

ఈ సమావేశం ముగించుకొని ఇడుపులపాయకు వై.ఎస్. షర్మిల బయలుదేరే ముందుకు  మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి  స్పష్టత ఇవ్వనున్నట్టుగా  ఆమె చెప్పారు. అన్ని విషయాలు మీకు చెబుతానని  షర్మిల తెలిపారు.  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసిన  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  మీతో నడుస్తానని ప్రకటించారని  మీడియా ప్రతినిధులు వై.ఎస్. షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి  ధన్యవాదాలు చెబుతున్నానని  షర్మిల తెలిపారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

ఈ నెల  3వ తేదీ రాత్రి వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వై.ఎస్. షర్మిల న్యూఢిల్లీ వెళ్లనున్నారు.ఈ నెల  4వ తేదీన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  మెరుగైన ఓట్లు, సీట్లు దక్కించుకోవాలనే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఆ పార్టీ పూర్తిగా దెబ్బతింది.  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడ కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. దరిమిలా ఆంధ్రప్రదేశ్ పై  కూడ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 
 

click me!