రెండో సారి ఏచూరి: సిపిఎంలో విభేదాలు లేవని స్పష్టీకరణ

First Published Apr 22, 2018, 2:22 PM IST
Highlights

రెండో సారి ఏచూరి: సిపిఎంలో విభేదాలు లేవని స్పష్టీకరణ

హైదరాబాద్: సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. హైదరాబాదులో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది.

సిపిఎం పోలిట్ బ్యూరో 17 మందితో ఏర్పాటైంది. పార్టీ నూతన కేంద్ర కమిటీ 95 మందితో ఏర్పడింది. గతంలో 92 మందితో కేంద్ర కమిటీ ఉంది. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా తమ్మినేని వీరభద్రం, వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్య ఎంపికయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర కమిటీలో మధు, గఫూర్, శ్రీనివాస రావులను తీసుకున్నారు. పాటూరి రామయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. తనను రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంపై సీతారాం ఏచూరి తన స్పందించారు. 

సిపిఎంలో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. బెటర్ ఇండియా కోసం తాము పనిచేస్తామని చెప్పారు. తమ ముందు ఎన్నో సవాళ్లున్నాయని అన్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పారు. 

సిపిఎం మహాసభల్లో 17 మందితో కూడిన పోలిట్ బ్యూరోనే పార్టీ కేంద్ర కమిటీ ఎన్నుకుంది. వారి పేర్లను సీతారాం ఏచూరి ప్రకటించారు. సీతారాం ఏచూరితో పాటు ప్రకాష్ కారత్, ఎస్ రామచంద్రన్ పిళ్లై, బిమాన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయి విజయన్, హసన్ ముల్లా, కొడియార్ బాలకృష్ణన్,త ఎంబ బేబి, సూర్జికాంత్ మిశ్రా, మహ్మద్ సలీం, సుభాషిణి అలీ, బీవి రాఘవులు, జి. రామకృష్ణన్, తపన్ సేన్, నీలోత్పల్ బసు పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. 
click me!