ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం... బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు, విచారణకు రాకుంటే

Siva Kodati |  
Published : Nov 18, 2022, 09:41 PM IST
ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం... బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు, విచారణకు రాకుంటే

సారాంశం

మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 తమ ఎదుట హాజరుకావాలని లేకుంటే అరెస్ట్ చేస్తామని ఆదేశించింది. 

మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 తమ ఎదుట హాజరుకావాలని సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు కూడా ఇదే కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. ఫాంహౌస్‌ వ్యవహారంలో నిందితుడైన రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

అంతకుముందు ఇదే కేసులో తుషార్‌కు సిట్ బృందం గురువారంనాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 లోపుగా విచారణకు  రావాలని ఆ నోటీసులో పేర్కొంది.  ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తుషార్ పేరును ప్రస్తావించారు.  దీంతో  తుషార్ ను  విచారణకు  రావాలని సిట్  బృందం  ఆయనకు  నోటీసులు జారీ  చేసింది.

ALso REad:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: కేరళ నుండి హైద్రాబాద్ కు చేరుకున్న సిట్ బృందం

మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేశారని రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్‌లను  పోలీసులు  అరెస్ట్ గత  నెల  26న అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.  ఈ కేసు  విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు  చేసింది. సిట్ కు  హైద్రాబాద్ సీపీ  సీవీ  ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు.  సిట్ దూకుడుగా  ఈ కేసును  విచారిస్తుంది.  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్  , హర్యానా  రాష్ట్రాల్లో  సిట్  సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్  అదుపులోకి  తీసుకుంది. 

తుషార్  కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రభారతి తుషార్ పేరును ప్రస్తావించినట్టుగా ఆడియో సంభాషణల్లో ఉంది. ఈ నెలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తుషార్ పేరును కూడా ప్రస్తావించారు. కేంద్  హోంమంత్రితో తుషార్  సమావేశమైన ఫోటోను  కూడా  మీడియా సమావేశంలో  కేసీఆర్  చూపించిన  విషయం  తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా