పుస్తకాలు స్కాన్ చేస్తే లక్షలిస్తామని.. జనానికి కుచ్చుటోపీ : డిజినల్ ఇండియా కేసులో సూత్రధారి అరెస్ట్

Siva Kodati |  
Published : Nov 18, 2022, 07:42 PM IST
పుస్తకాలు స్కాన్ చేస్తే లక్షలిస్తామని.. జనానికి కుచ్చుటోపీ : డిజినల్ ఇండియా కేసులో సూత్రధారి అరెస్ట్

సారాంశం

డిజినల్ ఇండియా ఫ్రాడ్ కేసులో కీలక సూత్రధారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుస్తకాలు, నవలలను స్కాన్ చేయాలని పది వేల పేపర్లు స్కాన్ చేస్తే రూ.50 వేలు ఇస్తామంటూ 600 మంది నిరుద్యోగులకు ఈ ముఠా కుచ్చుటోపీ పెట్టింది.

డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతోన్న ముఠాలో కీలక సూత్రధారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుస్తకాలను డిజిటలైజ్ చేస్తామంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.  పుస్తకాలు, నవలలను స్కాన్ చేయాలని.. పది వేల పేపర్లు స్కాన్ చేస్తే రూ.50 వేలు ఇస్తామంటూ 600 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఈ స్కీమ్‌లో చేరాలంటే ముందుకు లక్ష రూపాయాలు డిపాజిట్ చేయాలని వసూలు చేశారు. మొదట్లో లక్ష పెడితే... లక్షా 50 వేలు, 2 లక్షలు ఇచ్చారు. దీంతో కొంతమంది రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పరారయ్యారు. డిజినల్ ఇండియా ముఠాలోని ముగ్గురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కీలక సూత్రధారి అయిన దీపక్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు