టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు:రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డుచేసిన సిట్

By narsimha lode  |  First Published Nov 13, 2022, 10:08 AM IST

మొయినాబాద్  ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సిట్  బృందం.తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సిట్ బృందానికి  రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో  సిట్ బృందం ఎమ్మెల్యేల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. సిట్ బృందం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.  ఇప్పటికే ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డును సిట్ బృందం సేకరించింది. ఈ వాయిస్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడిన  ఆడియో, వీడియోలలోని వాయిస్ ను ఎఫ్ఎస్ఎల్ నిపుణులు పోల్చనున్నారు. 

ఈ ఏడాది అక్టోమర్ 26 వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురిచేసిన ఆరోపణలతో ముగ్గుిరిన పోలీసులు అరెస్ట్ చేశారు.ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి,ఏపీకి చెందిన సింహయాజీ ,హైద్రాబాద్ కుచెందిననందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు నిందితులు ప్రలోభాలకు గురి చేశారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది.దీని వెనుక బీజేపీ ఉందని  ఆ పార్టీ ఆరోపించింది.ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.కేసు విచారణపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు చేసింది. ఈ  కేసును సిట్ విచారిస్తుంది. 

Latest Videos

undefined

alsoread:మొయినాబాద్ ఫాంహౌస్ కేసు:నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ లో ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డింగ్

తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి నుండి సిట్ బృందం స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది.ముగ్గురు నిందితులు ఎలా కలిశారు. ఎలా ఎమ్మెల్యేలకు పరిచయమయ్యారనే విషయాలను సిట్ బృందం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నుండి సమాచారాన్నిసేకరించింది. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రోహిత్ రెడ్డి సిట్ బృందానికి ఫిర్యాదు చేశారు.గుజరాత్ ,యూపీ ల నుండి పోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదుచేశారు. సిట్ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ బీజేపీ రెండురోజుల క్రితం  హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.మరో వైపు నిందితులు  సుప్రింకోర్టులో  దాఖలు  చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 14న విచారించనుంది. 

click me!