టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ‌: మహబూబ్‌నగర్ మరో ఇద్దరు అరెస్ట్

By narsimha lode  |  First Published Apr 21, 2023, 12:04 PM IST


టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు  చెందిన  ఇద్దరిని  ఇవాళ  సిట్ అరెస్ట్  చేసింది.  


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్  లీక్ కేసులో  మరో ఇద్దరిని  శుక్రవారం నాడు సిట్ అధికారులు అరెస్ట్  చేశారు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు  చెందిన  
మైసయ్య, జనార్ధన్ లను  సిట్  అరెస్ట్  చేసింది.  వీరిద్దరూ  తండ్రీకొడుకులు,   టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  ఇప్పటివరకు  19 మందిని  అరెస్ట్  చేసింది సిట్.ఢాక్యానాయక్  నుండి   రూ.  2 లక్షలకు  వీరు కొనుగోలు  చేసినట్టుగా    సిట్  బృందం  గుర్తించింది.  

ఈ  ఏడాది  మార్చి  మాసంలో టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం  బయటకు వచ్చింది.  మార్చి  12, 15, 16, తేదీల్లో జరగాల్సిన  టౌన్ ప్లానింగ్,  సివిల్ సర్జన్  నియామాకాల  పరీక్షలను వాయిదా  వేసింది టీఎస్‌పీఎస్‌సీ . టీఎస్‌పీఎస్‌సీ  లోని  కంప్యూటర్లు  హ్యాక్ అయినట్టుగా  అనుమానించి ఈ పరీక్షలను  వాయిదా వేశారు. ఈ విషయమై  విచారణ నిర్వహించిన  పోలీసులు  

Latest Videos

టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ కాలేదని  గుర్తించారు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీకైనట్టుగా  పోలీసులు గుర్తించారు. ఈ ఏమాది మార్చి  5న జరిగిన అసిస్టెంట్  ఇంజనీర్ పరీక్ష  ప్రశ్నాపత్రం  లీకైందని  పోలీసులు గుర్తించారు.  దీంతో  ఈ కేసు విచారణను  సిట్ కు  అప్పగించింది ప్రభుత్వం.  గత  ఏడాది అక్టోబర్ మాసం నుండి  జరిగిన  పరీక్షలకు సంబంధించి  పరీక్ష పేపర్లు  లీకైనట్టుగా  సిట్  గుర్తించింది.   దీంతో  కొన్ని పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ  రద్దు చేసింది. కొన్ని పరీక్షలను వాయిదా వేసింది  టీఎస్‌పీఎస్‌సీ . పేపర్ లీక్ కేసులో  ప్రవీణ్, రాజశేఖర్ కీలకంగా వ్యవహరించినట్టుగా  సిట్ గుర్తించింది.  మరో వైపు  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  పెద్దల  పాత్ర  ఉందని  విపక్షాలు  ఆరోపిస్తున్నాయి. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  మంత్రి కేటీఆర్  పై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.  ఈ విమర్శలపై  వీరిద్దరికి  కేటీఆర్  లీగల్ నోటీస్ పంపారు. రూ. 100 కోట్లకు  పరువు నష్టం  దావా వేశారు.

tags
click me!