హైదరాబాద్ లో విషాదం... హాస్పిటల్లోనే గుండెపోటుకు గురయి గర్భిణి మృతి

By Arun Kumar P  |  First Published Apr 21, 2023, 11:12 AM IST

సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన గర్భిణి మహిళ ప్రమాదవశాత్తు మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 


హైదరాబాద్ : చిన్నా పెద్ద అని తేడాలేకుండా గుండె పోటు మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు ఆరోగ్యంగా వున్నవారు ఒక్కసారిగా గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఇళ్లు, రోడ్లు, స్కూల్స్, ఆఫీసులు... అక్కడ ఇక్కడని కాదు ఎక్కడపడితే అక్కడ గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పిటల్ లోనే గుండెపోటుకు గురయి ప్రాణాలు కోల్పోయింది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో హేమంత్‌-కల్పన దంపతులు నివాసముండేవారు. భర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి కాగా భార్య ఇంట్లోనే వుండేది. గతేడాదే వీరికి పెళ్లి కాగా కల్పన గర్భంతో వుంది. దీంతో సీమంతం కోసం ఇటీవలే కల్పనను పుట్టింటికి పంపించాడు హేమంత్. 

Latest Videos

కాచిగూడ పరిధిలోని సంజీవయ్య నగర్ లో తల్లిదండ్రుల వద్దే గత 15రోజులుగా వుంటోంది కల్పన. అయితే నిన్న(గురవారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. 

Read More  ఆడవాళ్లు ఈ ఆహారాలను తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

వైద్యులు కల్ఫనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది. ఇలా ముందే గర్భంతో వుండి గాయాలపాలైన ఆమె గుండె పోటుకు గురవడంతో డాక్టర్లు ప్రాణాలు కాపాడలేకపోయారు. కల్పనతో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోడంతో హేమంత్ తో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!