కోదండరాం పార్టీపై మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్

First Published Feb 26, 2018, 7:48 PM IST
Highlights
  • అదో పార్టీనా? అసలొస్తదా అది?
  • ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు
  • వాళ్లకు ఏం ఎజెండా ఉందని?
  • కాగితపు పడవ లాంటిదే

తెలంగాణలో కోదండరాం నేతృత్వంలో కొత్తగా రాబోతున్న జెఎసి పార్టీపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి సెటైర్ విసిరారు. జెఎసి పార్టీపై సెటైర్ వేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీని కడిగి పారేశారు. టిఆర్ యస్ ఎల్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

కోదండరాం పెట్టబోయే పార్టీని ఉద్దేశించి.. అదో పార్టీనా.. అది వస్తదా అసలు? అయినా ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ పార్టీ ఏ ఎజెండాతో వస్తారు? ఏదైనా ఎజెండా ఉండాలి కదా? వారికి? పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు చేసుకోలేరా రిజిస్ట్రేషన్. మీరు కూడా పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయినా అది కాగితపు పడవ లాంటి పార్టీగా మిగిలిపోతది. ఆ పార్టీకి తెలంగాణలో స్థానం ఉండదు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిది. మునిగిపోయే పడవలో ప్రయాణం చేయలేకనే కాంగ్రెస్ నేతలు పక్క పార్టీ లోకి వస్తున్నారు. లక్షల మంది యాత్రలు చేస్తరు. కాంగ్రెస్ బస్సు యాత్ర కూడా గంతే. ఈ బస్సు యాత్రే కాంగ్రెస్ పార్టీకి అంతిమ యాత్ర అవతుందని చెప్పొచ్చు. పాపం కాంగ్రెస్ వాళ్లకు కూడా ఎజెండా మేమే తయారు చేసి ఇయ్యాల్సి వచ్చేలా ఉంది. ఈ ముచ్చట సిఎం ఎప్పుడో చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో రెండే పార్టీలు మిగులుతాయి. ఒకటి టిఆర్ఎస్, ఇంకోటి ఎంఐఎం మాత్రమే.

click me!