కేసీఆర్‌కు పాదాబివందనం చేసిన సిద్దిపేట కలెక్టర్

By narsimha lodeFirst Published Jun 20, 2021, 4:33 PM IST
Highlights

 సిద్దిపేట  కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు పాదాబివందనం చేశారు. సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారంభించారు. నూతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లోని ఆసునులైన తర్వాత కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సీఎం పాదాలకు మొక్కారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులను కేసీఆర్ కు ఆయన పరిచయం చేశారు. 

సిద్దిపేట: సిద్దిపేట  కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు పాదాబివందనం చేశారు. సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారంభించారు. నూతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లోని ఆసునులైన తర్వాత కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సీఎం పాదాలకు మొక్కారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులను కేసీఆర్ కు ఆయన పరిచయం చేశారు. 

also read:బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది: కేసీఆర్

సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. సీఎం తన ప్రసంగం ముగింపు సమయంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి గురించి మాట్లాడారు.  వెంకట్రాం రెడ్డి చాలా మంచి అధికారి అని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాడని ఆయన చెప్పారు.

 తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడ సీఎం కేసీఆర్ కు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకొన్నారు. అంతకుముందు సిద్దిపేట సీపీ కార్యాలయాన్ని కూడ సీఎం ప్రారంభించారు. సీపీ కార్యాలయంలో ఆయన చైర్ పై సీపీని కూర్చొబెట్టారు. ఆ తర్వాత రిజిస్టర్ లో సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

click me!