నీట్ ఫలితాల్లో సత్తా చాటిన సిద్ధిపేట విద్యార్ధిని: హరీశ్ రావు అభినందనలు

Siva Kodati |  
Published : Nov 19, 2020, 10:14 PM ISTUpdated : Nov 19, 2020, 10:17 PM IST
నీట్ ఫలితాల్లో సత్తా చాటిన సిద్ధిపేట విద్యార్ధిని: హరీశ్ రావు అభినందనలు

సారాంశం

సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ బండి కనకయ్య సునీత దంపతుల కూతురు అశ్విని జాతీయ స్థాయిలో సత్తా చాటింది

సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ బండి కనకయ్య సునీత దంపతుల కూతురు అశ్విని జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో ఆ విద్యార్థిని 131వ ర్యాంకు సాధించింది.

దీంతో దేశంలోనే ప్రముఖమైన ఎయిమ్స్ లో సీటు దక్కించుకుంది. జిల్లా నుంచి ఈ ప్రతిష్టాత్మక సంస్థలో సీటు సాధించిన తొలి విద్యార్థిని అశ్విని కావడం విశేషం. ఈమె   సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఇంటర్ పూర్తి చేసింది.

నిరు పేద కుటుంబంలో జన్మించి.. ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీల్లోనే చదువుకున్న అశ్విని ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన ఎయిమ్స్ లో మెడికల్ సీటు సాధించింది. ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.

జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిన అశ్వినిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గ పేరును చాటిందని ప్రశంస్తున్నారు. అశ్వినిని జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. కూతురు ఈ స్థాయికి చేరేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులు కనకయ్య, సునీత దంపతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

తమ ఊరి ఆడబిడ్డ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వైద్య కళశాల అయిన ఎయిమ్స్ లో సీటు సాధించడంతో గ్రామస్తులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని అశ్వినికి అభినందనలు తెలుపుతున్నారు. విజయవంతంగా వైద్య విద్యను పూర్తి చేసి మంచి డాక్టర్ గా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?