ఎస్సైతో అక్రమ సంబంధం: లేడీ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య

Published : Jun 10, 2021, 07:48 AM ISTUpdated : Jun 10, 2021, 08:34 AM IST
ఎస్సైతో అక్రమ సంబంధం: లేడీ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య

సారాంశం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఎస్సై లేడీ కానిస్టేబుల్ తో పెట్టుకున్న వివాహేతర సంబంధం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. లేడీ కానిస్టేబుల్ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కామారెడ్డి: ఓ మహిళా కానిస్టేబుల్ తో ఎస్సై అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాన్ని భరించలేని కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని డెగ్లూర్ మండలానికి చెందిన శివాజీరావు (35) కామారెడ్డి జిల్లా మాధవపల్లికి చెందిన మహిళను 2005లో పెళ్లి చేసుకున్నాడు. 

అప్పటి నుంచి వారు మాధవపల్లిలోనే ఉంటున్నారు. వారిద్దరికి ఓ కుమారుడు పుట్టాడు. అయితే, 2008లో ఆమె మరణించింది. దీంతో పెద్దల అంగీకారం మేరకు అతను 2010లో ఆమె చెల్లెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం రెండేళ్ల కూతురు ఉంది. కాగా, శివాజీరావు రెండో భార్యకు 2018లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. 

హైదరాబాదులో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేస్తున్న శివప్రసాద్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసిది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయిలో అతనికి, కామారెడ్డి జిల్లాలో ఆమెకు పోస్టింగులు వచ్చాయి. రెండు ప్రాంతాలు కూడా 50 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉన్నాయి. దాంతో వారిద్దరు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 

ఆ విషయంపై శివాజీరావుకు, అతని రెండో భార్యకు తరుచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఎస్సైతో సంబంధాన్ని తెంచుకోవాలని అతను పలుమార్లు ఆమెకు చెప్పాడు. అయినా కూడా భార్య వినలేదు. పైగా ఎస్సై అతన్ని వేధిస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురై శివాజీ రావు మాధవపల్లిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

దానిపై తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు ఎస్సైని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  గాంధారి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. కేసు నమోదు చేశామని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

శివాజీ రావు ఆత్మహత్య కేసులో లేడీ కానిస్టేబుల్ మీద, ఎస్సై శివప్రసాద్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. కేసులో తొలి ముద్దాయిగా లేడీ కానిస్టేబుల్ ను, రెండో ముద్దాయిగా శివప్రసాద్ రెడ్డిని చేర్చారు. శివాజీరావును ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu