ఆస్పత్రికి తాళం..నడిరోడ్డుపై మహిళ ప్రసవం..!

Published : Jun 10, 2021, 07:32 AM IST
ఆస్పత్రికి తాళం..నడిరోడ్డుపై మహిళ ప్రసవం..!

సారాంశం

రేచింతల్ కు చెందిన పూజితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంమసభ్యులు ఉదయం 7గంటల సమయంలో మీర్జాపూర్ లోని ప్రభుత్వాసుప్రతికి తీసుకువచ్చారు.


నడిరోడ్డుపై ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. తీరా చూస్తే అక్కడ హాస్పిటల్ కి తాళం వేసి ఉంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో ఓ  మహిళ రోడ్డుపై ప్రసవించింది. న్యాలకల్ మండలం రేచింతల్ కు చెందిన పూజితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంమసభ్యులు ఉదయం 7గంటల సమయంలో మీర్జాపూర్ లోని ప్రభుత్వాసుప్రతికి తీసుకువచ్చారు.

ఆస్పత్రికి తాళం వేసి ఉండటం, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అప్పటికే నొప్పులు భరించలేకపోతున్న మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. అనంతరం తల్లీబిడ్డను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. మీర్జాపూర్ లో 24 గంటలు సేవలు అందించేలా 30 పడకలతో ఆస్పత్రిని నిర్మించినా ఉపయోగం లేదని స్థానికులు వాపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం