తెలంగాణలో నిలకడగా కరోనా వ్యాప్తి.. కేసులతో సమానంగా రికవరీలు

Siva Kodati |  
Published : Jun 09, 2021, 08:31 PM IST
తెలంగాణలో నిలకడగా కరోనా వ్యాప్తి.. కేసులతో సమానంగా రికవరీలు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,29,896 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,813 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,29,896 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,813 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో తెలంగాణలో నిన్న 17 మంది మరణించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,426కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,801 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,301 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 84, జీహెచ్ఎంసీ 179, జగిత్యాల 38, జనగామ 22, జయశంకర్ భూపాలపల్లి 39, గద్వాల 24, కామారెడ్డి 6, కరీంనగర్ 84, ఖమ్మం 180, మహబూబ్‌నగర్ 40, ఆసిఫాబాద్ 12, మహబూబాబాద్ 65, మంచిర్యాల 58, మెదక్ 17, మేడ్చల్ మల్కాజిగిరి 89, ములుగు 39, నాగర్ కర్నూల్ 34, నల్గగొండ 145, నారాయణపేట 18, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 74, సిరిసిల్ల 33, రంగారెడ్డి 109, సిద్దిపేట 52, సంగారెడ్డి 39, సూర్యాపేట 91, వికారాబాద్ 42, వనపర్తి 35, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ 64, యాదాద్రి భువనగిరిలో 35 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం