కీర్తి తల్లి రజిత చిట్టీల వ్యాపారం చేస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. వీరికి ఒక్కగానొక్క కుమార్తె కీర్తి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఓ స్నేహితురాలి సోదరుడైన బాల్ రెడ్డి(23) తో ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారడంతో ఏడాది క్రితమే కీర్తి గర్భందాల్చింది. ఏం చేయాలో తెలీక పక్కనే ఉండే శశికుమార్ సాయాం కోరింది.
రజిత హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కీర్తి అనే యువతి కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా...ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తి గతంలో కూడా తల్లిని చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో బీరులో నిద్రమాత్రలు కలిపి తల్లిని చంపేందుకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో కీర్తి పోలీసులకు వెల్లడించింది.
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విలెకర్లకు పూర్తి వివరాలు వెల్లడించారు. బీటెక్ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతుండే శశికుమార్ రూ.10లక్షలుంటే వ్యాపారం చేయవచ్చని భావించాడు. దానికోసం ప్లాన్ వేశాడు. తన ప్రియురాలు కీర్తి తల్లిని చంపేస్తే... ఆస్తి మొత్తం దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే కీర్తి ని రెచ్చగొట్టి మరీ తల్లిని చంపేలా చేశాడు.
Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి
కీర్తి తల్లి రజిత చిట్టీల వ్యాపారం చేస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. వీరికి ఒక్కగానొక్క కుమార్తె కీర్తి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఓ స్నేహితురాలి సోదరుడైన బాల్ రెడ్డి(23) తో ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారడంతో ఏడాది క్రితమే కీర్తి గర్భందాల్చింది. ఏం చేయాలో తెలీక పక్కనే ఉండే శశికుమార్ సాయాం కోరింది.
వారికి సహాయం చేయడానికి అంగీకరించిన శశికుమార్.. కీర్తి, బాల్ రెడ్డిలను కారులో ఆమన్ గల్ తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. బాల్ రెడ్డితో కూతురు చనువుగా ఉంటోందని తెలుసుకున్న కీర్తి తల్లిదండ్రులు అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే... మధ్యలోకి మళ్లీ శశికుమార్ వచ్చాడు. అబార్షన్ పేరు చెప్పి శశికుమార్ ... కీర్తిని బెదిరించేవాడు.
Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే
బలవంతంగా ఆమెతో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాడు. ఆ క్రమంలో... కీర్తి తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు , వీడియోలు తీశాడు. అనంతరం వాటిని చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. కీర్తి తల్లి రజిత చిట్టీల వ్యాపారం చేసి ఆస్తి బాగా సంపాదించిందని తెలుసుకున్నాడు.
వెంటనే ప్లాన్ వేసి...కీర్తిని రెచ్చగొట్టి తల్లిని చంపేలా చేశాడు. గతంలో ఒకసారి కీర్తి తల్లిని చంపేందుకు ప్లాన్ చేసి ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. బీరులో నిద్రమాత్రలు కలిపి తాగించడానికి ప్రయత్నించింది. అది ఫెయిల్ అవ్వడంతో... తర్వాత మళ్లీ ప్లాన్ వేసి... చంపారు. కీర్తి తల్లి కళ్లల్లో కారం చల్లగా... శశి చున్నీతో మెడ బిగించి హత్య చేశాడు.
తన తల్లి రజితను తాను, శశి కలిసి హత్య చేసినట్లు కీర్తి పోలీసు విచారణలో అంగీకరించింది. కీర్తితో పాటు శశిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేదీన కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్ కు వెళ్లింది. ఆ సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు.
Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో.
రజిత తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి ఉంది. దాన్ని గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. దాంతో రజితను చంపేస్తేనే తాము కలిసి ఉండవచ్చునని శశి కీర్తికి నూరిపోశాడు. రజిత మందలించడంతో బయటకు వెళ్లిన శశి బీరు బాటిల్స్ తో కీర్తి ఇంటికి వచ్చాడు. కీర్తి తల్లి లోపలి గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తితో శశి బీరు తాగించాడు.
మద్యం మత్తులో ఉన్న కీర్తిని శశి హత్యకు ప్రేరేపించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లారు. తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండు పెట్టి నొక్కగా, శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. దుర్వాసన వస్తుండడంతో రజిత శవాన్ని కారులో తీసుకుని వెళ్లి రామన్నపేట దగ్గరలో రైలు పట్టాలపై పడేశారు. కీర్తి ఇంట్లోంచి మూడు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.