మహిళా సాప్ట్ వేర్ ఇంజనీర్ ను లైంగికంగా వేధిస్తున్న అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
హైదరాబాద్ : మహిళా టెకీని వేధిస్తున్న ఓ ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. సాప్ట్ వేర్ ఇంజనీర్ ఫోన్ నెంబర్ సంపాదించిన యువకుడు ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. న్యూడ్ గా వీడియో కాల్స్ చేస్తూ లైంగికంగా వేధించడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల సాయితేజ అపార్ట్ మెంట్ లో ఓ మహిళా టెకీ నివాసముండేది. ఆ అపార్ట్ మెంట్ వాచ్ మెచ్ గా కడ్తాల్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ పనిచేసేవాడు. దీంతో అపార్ట్ మెంట్ లో పనిచేసేవారి ఫోన్ నెంబర్లు అతడి వద్ద వున్నాయి. ఇలా టిసిఎస్ లో పనిచేసే టెకీ ఫోన్ నెంబర్ కూడా అతడి వద్ద వుంది.
అయితే సదరు మహిళా టెకీపై మనోజ్ కన్నేసాడు. ఆమె ఫోన్ కు వీడియో కాల్ చేసి బట్టలేమీ లేకుండా న్యూడ్ గా కనిపిస్తూ చాలా అసభ్యంగా వ్యవహరించేవాడు. ఆమె పలుమార్లు గట్టిగా హెచ్చరించినా అతడి తీరులో మార్పురాలేదు. పైగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో విసిగిపోయిన మహిళా టెకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More ఖమ్మంలో మామిడి తోటలో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్య...
మహిళా టెకీని వేధిస్తున్న మనోజ్ ను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని జైలుకు పంపించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మనోజ్ ను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.