ఆమ్రపాలికి ‘దెయ్యం’ షాక్

Published : Aug 17, 2018, 03:07 PM ISTUpdated : Sep 09, 2018, 10:50 AM IST
ఆమ్రపాలికి ‘దెయ్యం’ షాక్

సారాంశం

జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా దెయ్యాలు, భూతాలు, మంత్రాలు, మాయల పేరుతో ఏవైనా సంఘటనలు జరిగితే రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న కలెక్టర్‌ ఆర్టికిల్‌ 51 ఏ (హెచ్‌) అనుసరించి అక్కడ విజ్ఞానాన్ని నెలకొల్పి అజ్ఞానాన్ని తరిమేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

వరంగల్ కెలక్టర్  ఆమ్రపాలికి షాక్ తగిలింది. ఇటీవల ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నివసించే భవనంలో దెయ్యం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాస్తిక్‌ రాకేష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అత్యున్నత పదవిలో ఉన్న, జిల్లా మెజిస్ట్రేట్‌ అయిన వ్యక్తులు సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే విషయాలపై స్పందించేపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా దెయ్యాలు, భూతాలు, మంత్రాలు, మాయల పేరుతో ఏవైనా సంఘటనలు జరిగితే రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న కలెక్టర్‌ ఆర్టికిల్‌ 51 ఏ (హెచ్‌) అనుసరించి అక్కడ విజ్ఞానాన్ని నెలకొల్పి అజ్ఞానాన్ని తరిమేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
 
కలెక్టర్‌ తన బంగ్లాలో దెయ్యం ఉందని భయపడడం ఎంతో అవమానకరం అన్నారు. తన భవనంలో దెయ్యం ఉందని చెప్పిన వారిని నాస్తిక సమాజం సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలలో ఐఏఎస్‌ అధికారులు శ్మశాన నిద్రలు చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంటే వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవకాశం ఇస్తే సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ బృందం కలెక్టర్‌ నివాసంలోని మొదటి అంతస్తులో దెయ్యం లేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

read more news..

నా ఇంట్లో దెయ్యం, అందుకే అక్కడ పడుకోను: కలెక్టర్ ఆమ్రపాలి

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu