కేసీఆర్ కి షాక్...మూకుమ్మడి రాజీనామాలు

Published : Nov 16, 2018, 09:34 AM IST
కేసీఆర్ కి షాక్...మూకుమ్మడి రాజీనామాలు

సారాంశం

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి భద్రాద్రి కొత్తగూడెంలో ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి భద్రాద్రి కొత్తగూడెంలో ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అమలుపరుస్తున్న విధానాలు నచ్చకే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు చంద్రుగొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లు గెలుపు కోసం కృషి చేసిన తమని విస్మరించి, ఆనాడు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను తన వెంట తిప్పుకుంటున్నారని తెలిపారు. గిరిజన నాయకుడై ఉండి గిరిజనులను పట్టించు కోలేదన్నారు. 

రావికంపాడు, తిప్పనపల్లి మాజీ సర్పంచ్‌లు మాలోత్‌ హనుమా, దరావత్‌ పార్వతి రామారావు, సొసైటీ డైరెక్టర్‌ బాణోత్‌ బాలాజీ, మండల మైనార్టీ నాయకులు ఎస్‌డి. జాకీర్‌, రావికంపాడు సీనియర్‌ నాయకులు పొన్నబోయిన బిక్షమయ్య, రామారావు, హరిలాల్‌, వీరబాబు తదితరులు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తామంతా వనమా వెంకటేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu