Chicken Prices: తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉంది. స్కిన్ ఉన్న చికెన్ రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. కేజీ చికెన్ ధర కర్నాటకలో 350పైగా చేరగా, కేరళలో 280 రూపాయలుగా ఉంది. ఏపీలోనూ చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Chicken Prices Soar: దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో చికెన్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉంది. స్కిన్ ఉన్న చికెన్ రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. కేజీ చికెన్ ధర కర్నాటకలో 350పైగా చేరగా, కేరళలో 280 రూపాయలుగా ఉంది. ఏపీలోనూ చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో చికెన్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. సాధారణంగా వేసవిలో విపరీతమైన వేడి లేదా ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోవడం, చికెన్ సరఫరా లేకపోవడం వల్ల ధరలు పెరుగుతుంటాయి. అయితే, ఇప్పటివరకు కొనసాగిన వేసవి పరిస్థితులు, పెళ్లిళ్లు, దావత్ ల సీజన్ కారణంగా చికెన్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉంది. స్కిన్ ఉన్న చికెన్ రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. గత రెండు వారాలుగా చికెన్ ధరలు మారుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో రోజుకు సగటున 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గత ఆదివారం హైదరాబాద్ లో 50 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు చికెన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఒక్క తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాలకలో కూడా చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రాయిలర్ చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో కేరళలోని హోటళ్లు నడిపేవారు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనీ, కేవలం 10 రోజుల వ్యవధిలో కిలో చికెన్ ధర రూ.70-75 పెరిగిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో అనేక హోటళ్లలో చికెన్ ఆధారిత వంటకాల ధర పెరగడం ప్రారంభమైంది, నిర్దిష్ట వంటకాన్ని బట్టి ధరలు రూ .10-30 వరకు పెరిగాయి.
ఏపీలోనూ..
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల బ్రాయిలర్ చికెన్ ధరలు ఎన్నడూలేని విధంగా కిలోకు 350 వరకు పెరిగాయి. సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మండే ఎండలు పౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీయడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు వారాల్లో ఎండల తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్‌లో బోన్‌లెస్ చికెన్ ధరలు కిలోకు 500 నుండి ₹600 వరకు ఉన్నాయి. 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రతిరోజూ కనీసం 20 శాతం కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ వర్గాలు తెలిపాయి.