Nizamabad: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలోని ప్రతి పార్టీ ఈసారి ఓటర్లకు అందించేందుకు ఒక నమూనా పాలనను ఎంచుకుంటూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదనే పరిణామాలను కల్పిస్తున్నాయి.
9 BJP leaders join BRS in Nizamabad: ఎన్నికల ముందు బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది నేతలు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలోని ప్రతి పార్టీ ఈసారి ఓటర్లకు అందించేందుకు ఒక నమూనా పాలనను ఎంచుకుంటూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల మధ్య త్రిముఖ పోరుకు తప్పదనే పరిణామాలను కల్పిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు సిరికొండ మండలానికి చెందిన పలువురు సభ్యులు ఆదివారం భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో నాయకులు, సభ్యులు పార్టీలో చేరారు. సభ్యులకు స్వాగతం పలికిన గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోనే తెలంగాణ పురోభివృద్ధి చెందుతుందని గ్రహించి చాలా మంది బీఆర్ ఎస్ లో చేరారన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను బీఆర్ఎస్ మాత్రమే తీర్చగలదనీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదని భావించి పార్టీని వీడినట్లు కొత్త బీఆర్ఎస్ సభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 23న నిర్మల్ లో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ కార్యకర్తలు బీఆర్ ఎస్ లో చేరారు. ఈ నెల 14న కామారెడ్డిగూడెం గ్రామ ఎంపీటీసీ మహ్మద్ జాకీర్ హుస్సేన్ సహా కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు.