దుర్గం చిన్నయ్యపై చర్యలకు డిమాండ్::కళ్లకు గంతలతో న్యూఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ముందు శేజల్ ఆందోళన

By narsimha lode  |  First Published Jun 15, 2023, 3:02 PM IST

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఆరిజన్  డెయిరీకి చెందిన  శేజల్ ఇవాళ న్యూఢిల్లీలోని బీఆర్ఎస్  కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.


న్యూఢిల్లీ: బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్యపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఆరిజన్  డెయిరీ కి చెందిన  శేజల్ గురువారంనాడు  న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు  ఆందోళనకు దిగారు.  కళ్లకు గంతలు కట్టుకుని  శేజల్  ఆందోళనకు దిగారు. తనను మానసికంగా ,శారీరకగా  ఎమ్మెల్యే  బెల్లంపల్లి ఎమ్మెల్యే  చిన్నయ్య వేధించారన్నారు.

మహిళలకు  రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారన్నారు. కానీ  దుర్గం చిన్నయ్య విషయంపై దృష్టి కేంద్రీకరించాలని  ఆమె  కోరారు.  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య తనపై  లైంగిక వేధింపులకు  పాల్పడ్డారని  శేజల్ ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా   దుర్గం చిన్నయ్యపైచర్యలు తీసుకోవాలని  కోరుతూ శేజల్  ఆందోళనలు నిర్వహిస్తుంది.   సుమారు 20 రోజులకు పైగా  శేజల్  న్యూఢిల్లీలోనే  శేజల్ ఉంటుంది.  తనపై  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్య  లైంగిక వేధింపులను నిరసిస్తూ  జాతీయ  మహిళ కమిషన్ కు కూడా ఫిర్యాదు  చేశారు. అంతకుముందు  జంతర్ మంతర్ వద్ద  ఆమె  ధర్నాకు దిగారు.  ఇటీవల  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్యపై   సీబీఐకి  శేజల్ ఫిర్యాదు  చేశారు. 

Latest Videos

undefined

also read:లైంగిక వేధింపులు:ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి శేజల్ ఫిర్యాదు

శేజల్ చేసిన ఆరోపణలను  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే  శేజల్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన  గతంలోనే  ప్రకటించారు.   తనపై  శేజల్ చేసిన ఆరోపణలను  ఎమ్మెల్యే  ఖండిస్తున్నా కూడా శేజల్ మాత్రం  నిరసనలు  ఆపడం లేదు.

తెలంగాణలో  పోలీసులకు  దుర్గం చిన్నయ్యపై  ఫిర్యాదు చేసింది. అయితే తాను ఇచ్చిన ఆధారాలను  పోలీసులు ధ్వంసం  చేశారని శేజల్ ఆరోపించారు.  దీంతో తాను  జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టుగా  కూడ ఆమె తెలిపింది.  శేజల్ ఫిర్యాదు మేరకు  ఈ విషయమై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని  జాతీయ మహిళ కమిషన్ ఆదేశించింది.   జాతీయ మహిళ కమిషన్ కు తెలంగాణ పోలీస్ శాఖ ఏ రకమైన నివేదిక ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ  శేజల్ న్యూఢిల్లీలో   ఆత్మాహత్యాయత్నం  చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత   ఆమె తన నిరసన కార్యక్రమాలను  కొనసాగిస్తుంది. 

click me!