కేటీఆర్‌తో రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భేటీ

Published : Dec 12, 2018, 12:11 PM ISTUpdated : Dec 12, 2018, 12:13 PM IST
కేటీఆర్‌తో రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే  కోరుకంటి చందర్ భేటీ

సారాంశం

రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన కోరుకంటి చందర్.. టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఉదయం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసిన చందర్ టీఆర్ఎస్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

ఉద్యమ కాలం నుంచి తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని టీఆర్ఎస్ తన మాతృసంస్థ అని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం టికెట్ ఆశించిన కోరుకంటి భంగపడ్డారు. ఆయనకు బదులు సోమారపు సత్యనారాయణకు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కన్ఫార్మ్ చేయడంతో చందర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి