యువతి దారుణ హత్య: ఎవరీ ప్రియాంక రెడ్డి?

Published : Nov 28, 2019, 01:39 PM ISTUpdated : Nov 28, 2019, 01:42 PM IST
యువతి దారుణ హత్య: ఎవరీ ప్రియాంక రెడ్డి?

సారాంశం

శంషాబాద్ ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెను చంపి, పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారు. ప్రియాంక రెడ్డి ఎవరు, ఆమె వృత్తి ఏమిటి అనేది పోలీసులు తెలుసుకున్నారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి  శివారులో జరిగిన యువతి  హత్య కేసులో షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి శంషాబాద్ డిసిపి  ప్రకాష్ రెడ్డి షాద్ నగర్ ఏసీపీ సురేందర్ చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియాంక రెడ్డి నవాబ్ పేటలోని కొల్లూరులో వెటర్నరీ డాక్టరుగా పనిచేస్తున్నారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో శంషాబాద్ కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు సొంత గ్రామం కొల్లాపూర్ నర్సాయపల్లి గ్రామానికి చెందిన వారు. అయితే శంషాబాద్ లో స్థిరపడ్డట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: హాస్పిటల్ కి వెళ్లి మిస్సింగ్... ఉదయానికి శవంగా.. యువతి దారుణ హత్య

మృతి చెందిన యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఎందుకు ఆ యువతిని పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు త్వరలోనే ఘాతుకానికి పాల్పడినా దుండగులను పట్టుకుంటమని తెలిపారు.

ప్రియాంక రెడ్డి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఉదయానికి ఆమె శవమై తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?