హాస్పిటల్ కి వెళ్లి మిస్సింగ్... ఉదయానికి శవంగా.. యువతి దారుణ హత్య

Published : Nov 28, 2019, 12:47 PM ISTUpdated : Nov 28, 2019, 02:19 PM IST
హాస్పిటల్ కి వెళ్లి  మిస్సింగ్... ఉదయానికి శవంగా.. యువతి దారుణ హత్య

సారాంశం

మార్గ మధ్యంలో స్కూటీ పాడయ్యిందని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ ఆగిపోయిన ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఉన్నారంటూ ఫోన్ లో ప్రియాంక భయంగా చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఓ యువతి హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లి మిస్సయ్యింది. తీరా చూస్తే... మరసటి రోజు ఉదయానికి శవమై కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ప్రియాంక రెడ్డి అనే యువతి బుధవారం ట్రీట్మెంట్ కోసం మాదాపూర్ లోని హాస్పిటల్ కి వెళ్లింది. మార్గ మధ్యంలో స్కూటీ పాడయ్యిందని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ ఆగిపోయిన ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఉన్నారంటూ ఫోన్ లో ప్రియాంక భయంగా చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కాగా... ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమె ఫోన్ కి ప్రయత్నించినా కలవలేదు. తీరా చూస్తే... గురువారం ఉదయం శవమై కనిపించింది. ఆమెను సజీవదహనం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. . ప్రియాంక రెడ్డి... వృత్తి రిత్యా డాక్టర్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి కింద శవం దొరికింది. ప్రియాంక రెడ్డి  నవాబుపేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తోందని తెలిసింది.

ఎక్కడో హత్య చేసి శవాన్ని అండర్ బ్రిడ్జి కింద తగలపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పంక్చర్ అయ్యిందని లారీ డ్రైవర్లు చెప్పారని ప్రియాంక సోదరి చెబుతోంది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu