స్నేక్స్‌ను షేక్ చేస్తున్న సైదా: పాములు పడుతున్న కరీంనగర్ మహిళ

Published : Jul 26, 2021, 07:29 PM IST
స్నేక్స్‌ను షేక్ చేస్తున్న సైదా: పాములు పడుతున్న కరీంనగర్ మహిళ

సారాంశం

పాములను అవలీలగా పడుతోంది కరీంనగర్ జిల్లాకు చెందిన షేక్ సైదా. తండ్రి నుండి పాములను పట్టడం ఆమె నేర్చుకొంది. రాత్రనక పగలనక ఆమె పాములు పడుతోంది. 

కరీంనగర్: పాములను అవలీలగా  ఓ మహిళ పట్టుకొంటుంది. పాములు పట్టడం ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆమె జీవనం సాగిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన షేక్ సైదా పాములను పట్టుకోవడాన్నే వృత్తిగా చేసుకొంది.తండ్రి నుండి పాములను పట్టడంలో ఆమె మెళుకువలను నేర్చుకొన్నారు. ఇప్పటివరకు వేల పాములను ఆమె పట్టుకొన్నారు.  ఇన్ని పాములు పట్టినా కూడ ఆమె ఇంతవరకు ఒక్కసారి కూడ పాము కాటుకు గురికాలేదు.  అవలీలగా ఆమె పాములను పట్టుకొంటారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమె పాములను పడతారు. 

"

కరీంనగర్‌ తీగులగుట్టపల్లికి చెందిన షేక్‌ సయిదా  నేర్పరితనం చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. తమ ప్రాంతంలో పాము వచ్చిందనే సమాచారం అందుకోవడంతోటే ఉరుకులు పరుగులతోనే చేరుకుంటోంది. రాత్రి పగలు ఎప్పుడైనా సరే పాము కనిపించిన ప్రాంతానికి చేరుకొని ప్రాణాలకు తెగించి పట్టుకొని ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌