షాద్ నగర్ లో భారీ పేలుడు.. 11 మందికి  తీవ్ర గాయాలు..  పలువురి పరిస్థితి విషమం..

By Rajesh Karampoori  |  First Published Jul 17, 2023, 2:04 AM IST

రంగారెడ్డి జిల్లా శ్రీనాథ్‌ రోటో ప్యాక్‌ కంపెనీలో పేలుడు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో మంటలు భారీగా చెలరేగాయి. ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.  


ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో పలు కంపెనీల్లో పేలుడు ఘటనలు , భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  వివరాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల శివార్ లో  గల ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో  భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.  

అలాగే మరి కొందరిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నవారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బూర్గుల శివారులో ఉన్న శ్రీనాథ్‌ రోటో ప్యాక్‌ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కంపెనీలో సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Latest Videos

click me!