
నల్గొండ మున్సిపాలిటీ పాలకవర్గంలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. టీఆర్ఎస్‌కు చెందిన మున్సిపల్ చైర్మన్‌తో ఆ పార్టీకి చెందిన పులవురు కౌన్సిలర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా 14 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు ఎగరవేశారు. తమ వార్డుల్లో అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని వారు ఆరోపించారు.అధికార పార్టీలో ఉన్న తమ వార్డుల్లో అభివృద్ది చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పలువురు కౌన్సిలర్లు శుక్రవారం రహస్యంగా సమావేశమై భవిష్యత్తు ప్రణాళికపై చర్చించారు. వీరంతా ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, నేడు జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌కు వారు గైర్జాహరయ్యారు. దీంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారు అసమ్మతిని వీడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.