తెలంగాణలో భారీ వర్షాలు : వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

By AN TeluguFirst Published Aug 31, 2021, 9:44 AM IST
Highlights
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), హైదరాబాద్ సెంటర్, మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ : తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వికారాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో కొత్తగా పెళ్లైన మహిళతో సహా ఆరుగురు నీటి ప్రవహంలో కొట్టుకుపోయారు. వరంగల్‌లో సోమవారం ఓ టెక్కీ మృతదేహాన్ని డ్రెయిన్ నుంచి వెలికితీశారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), హైదరాబాద్ సెంటర్, మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఓ ఘటనలో కొత్తగా పెళ్లైన యువతితో సహా ముగ్గురు మృత్యువ్యాత పడ్డారు. మోమిన్ పేట్ కు చెందిన నవాజ్ రెడ్డికి వికారాబాద్ జిల్లా రావులపాలె గ్రామానికి చెందిన ప్రవళిక (21) తో ఇటీవలే వివాహం జరిగింది. అత్తగారింట్లో జరిగిన వేడుకకు హాజరైన నవాజ్ రెడ్డి భార్య, ఇద్దరు అక్కలతో కారులో తన స్వగ్రామం మోమిన్‌పేట్ కి వెళ్తున్నాడు.
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో తిమ్మాపూర్ వాగు వద్ద వంతెనను దాటుతుండగా, వేగంగా వచ్చిన నీటి ప్రవాహానికి  కారు వాగులో కొట్టుకుపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రవళిక (21), శ్వేత (32), శ్వేత కుమారుడు త్రినాథ్ రెడ్డి (8) లు జల సమాధి అయ్గాయారు. కాగా  నవాజ్ రెడ్డి, మరో సోదరి తప్పించుకున్నారు. ప్రవళిక, శ్వేత మృతదేహాలు లభ్యం కాగా, బాలుడి మృతదేహం ఇంకా వెలికి తీయలేదు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో జరిగిన మరో సంఘటనలో, ద్విచక్ర వాహనంపై బూరుగుపల్లి గ్రామంలో వాగు దాటుతున్న ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం వేగంగా ప్రవహిస్తున్న నీటిలో నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా బైక్  అదుపు తప్పింది. పిలియన్ సీటుపై ఉన్న ఇద్దరు బాలికలు కొట్టుకుపోయారు. 
రాజాపేట్ పోలీసులు బాలికలలో ఒకరైన జి. సింధుజ (24) మృతదేహాన్ని వెలికితీశారు. మరొక అమ్మాయి పి. బిందు (22) మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.




ఆదివారం రాత్రి శంకర్‌పల్లిలో జరిగిన మరో సంఘటనలో, 70 ఏళ్ల వ్యక్తి కారుతో సహా వాగులో కొట్టుకుపోయి మరణించాడు. భారీ వర్షాలకు వంతెన మీదుగా వాగు పొంగిపొర్లుతుండగా వంతెన దాటే ప్రయత్నం చేయడంతో కారు కొట్టుకుపోయింది. కాగా కారులోని మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వాహనం, బాధితుడి మృతదేహంతో పాటు సోమవారం వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), హైదరాబాద్ సెంటర్, మంగళవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

click me!