బోరు బావిలో కలిసిన యూరియా: పలువురికి అస్వస్థత, 5 పశువులు మృతి

Siva Kodati |  
Published : Jun 16, 2019, 04:21 PM ISTUpdated : Jun 16, 2019, 04:22 PM IST
బోరు బావిలో కలిసిన యూరియా: పలువురికి అస్వస్థత, 5 పశువులు మృతి

సారాంశం

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేగోడు మండలం మర్పల్లిలో యూరియా గుళికలు కలిసిన నీరు త్రాగి ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అదే నీరు తాగిన ఐదు పశువులు సైతం చనిపోయాయి.

గొల్ల కుమార్ అనే వ్యక్తి పోలంలో మోటారు గత కొంతకాలంగా పనిచేయడం లేదు. దీనిని రిపేర్ చేయించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పైకి రాకపోవడంతో.. యూరియా గుళికలను దానిలో వేశాడు.

ఇలా వేస్తే మోటారు వదులుగా మారి పైకి వస్తుందని అతను భావించాడు. యూరియా వేశాక మోటారు పైకి వచ్చింది. మరమ్మత్తుల అనంతరం దానిని తిరిగి లోపలికి దించారు. ఈ క్రమంలో కుమార్ తాను కొత్తగా కడుతున్న ఇంటి నిర్మాణానికి నీరు అవసరమై.. అదే బోరు నుంచి నీటిని డ్రమ్ముల్లో తరలించాడు.

ఈ క్రమంలో పశువులు, కొందరు స్థానికులు ఆ నీటిని తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని నారాయణ్ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం