నేడు నిరసనలకు పిలుపు: పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

By narsimha lode  |  First Published Dec 14, 2022, 9:30 AM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు  హౌస్ అరెస్ట్  చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న సీజ్  చేశారు.  దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. 


హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను  పోలీసులు  బుధవారంనాడు హౌస్ అరెస్ట్  చేశారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్ట్రాటజీ టీమ్ హెడ్  సునీల్ కనుగోలు  కార్యాలయాన్ని(కాంగ్రెస్ వార్ రూమ్ )  సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నాడు రాత్రి సీజ్ చేశారు.అంతేకాదు  ఐదుగురిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ  ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్  కు వ్యతిరేకంగా  సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారని  అందిన ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు  ఈ కార్యాలయాన్ని సీజ్  చేశారు.   నిన్న రాత్రి  సునీల్  కార్యాలయాన్ని  సీజ్  చేసేందుకు   వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులతో కాంగ్రెస్ నేతలు  వాగ్వావాదానికి దిగారు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు  సైబర్ క్రైమ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను  సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు నిరసనలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని కోరారు.  

కాంగ్రెస్ పార్టీ  వార్ రూమ్ ను  పోలీసులు సీజ్  చేయడంపై ఆ పార్టీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతలు ఆందోళనలు చేసే అవకాశం ఉన్నందున  ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, మల్లు రవి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,  వి. హనుమంతరావు సహా పలువురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

click me!