jagityal car accident : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు మృతి

Published : Nov 15, 2023, 04:24 PM IST
jagityal car accident : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు మృతి

సారాంశం

jagityal road accident : జగిత్యాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఐదుగురితో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.  మండలంలోని తిప్పన్నపేట గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. జగిత్యాల మండలంలోని తిప్పన్నపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. 

Doda Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మందికి పైగా మృతి

వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదానికి గురైన కారు ధర్మపురి మండలంలోని రాజారం గ్రామం నుంచి కరీంనగర్ వెళ్తోంది. ఐదుగురితో వెళ్తున్్న ఆ కారు బుధవారం ఉదయం సమయంలో జగిత్యాల మండలంలోని తిప్పన్నపేట జాతీయ రహదారి వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల భాస్కర్‌, జగిత్యాల గ్రామీణ మండలం హబ్సీపూర్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహేశ్‌ ఘటన స్థలంలోనే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

tunnel collapse : కుప్పకూలిన సొరంగం.. సహాయక చర్యల్లో ఆటంకాలు.. ఆగ్రహంతో ఆందోళన చేపట్టిన కార్మికులు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాలలోని హాస్పిటల్ కు తరలించారు. వారు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు