కేసీఆర్ తాగుబోతు, కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టండి: రేవంత్ రెడ్డి

Published : Nov 05, 2018, 04:33 PM IST
కేసీఆర్ తాగుబోతు, కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టండి: రేవంత్ రెడ్డి

సారాంశం

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాగుబోతు ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం నుంచి విముక్తి కల్పించండని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్‌ నియోజకవర్గంలోని శివ్వంపేటలో మాజీమంత్రి సునీతా రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఏం తెలుసునని ప్రశ్నించారు. 

మెదక్‌: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాగుబోతు ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం నుంచి విముక్తి కల్పించండని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్‌ నియోజకవర్గంలోని శివ్వంపేటలో మాజీమంత్రి సునీతా రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఏం తెలుసునని ప్రశ్నించారు. 

నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ ఏ సమస్యలను తీర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టవని కేవలం ఫామ్‌ హౌజ్‌లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసునని ఎద్దేవా చేశారు.

తాగుబోతుల చేతుల్లో నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కోరారు. కేసీఆర్‌ దగ్గర గూలాం గిరి చేసే మదన్‌ రెడ్డి కావాలో అసెంబ్లీలో నర్సాపూర్‌ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో ఆలోచించడంటూ ప్రజలను కోరారు. కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాశీర్వాదంతో నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

మరోవైపు బంగారు తెలంగాణలో మహిళలు మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సి దుస్థితి వచ్చిందని సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయోద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నా, కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఆలోచన కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చిందని సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచార ర్యాలీ చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. నర్సాపూర్‌ పౌరుషాల పోరుగ్డడ అని గుర్తు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu