Minor Girl Rape case: మైన‌ర్ పై లైంగిక దాడి.. రచయిత అరెస్ట్​

By Rajesh KFirst Published Jan 12, 2022, 12:04 PM IST
Highlights

Minor Girl Rape case: మహిళ‌ల‌, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ఎన్నిక‌ఠిన త‌ర చ‌ట్టాల‌ను తెచ్చినా.. అఘాత్యాలు ఆగ‌డం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా న‌గ‌రంలో ఓ బాలికపై  ఓ  పుస్త‌క ర‌చ‌యిత‌ పశువులా  ప్రవర్తించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని బడంగ్‌పేట్‌ పరిధిలో జరిగింది.
 

Minor Girl Rape case:  మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో హైదరాబాద్ లోని సుజాత లా బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రచయిత, ప్రచురణకర్త గాదె వీరారెడ్డిని రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. 

 పోలీసుల వివరాల ప్ర‌కారం.. సుజాత లా పబ్లిషింగ్‌ హౌస్‌ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నాడు. అత‌ని ఇంట్లో  గ‌తంలో ఓ మ‌హిళ ప‌నిమ‌నిషిగా ప‌ని చేసి.. ఇటీవ‌లే ఆమె మీర్‌పేట పీఎస్‌ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉండేవాళ్లు. ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్‌ చేస్తుండేది.
 
ఈ నేపథ్యంలో నిందితుడు గాదే వీరారెడ్డి తరుచు ఏదొక కార‌ణంతో ఆమె ఇంటికి వెళ్తేవాడు. ఇటీవ‌ల త‌న పుస్త‌కాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు సంచులు కావాలంటూ..  బాధితురాలి ఇంటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరులో ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె కుమార్తె(13)తో అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే.. గతేడాది డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న  వీరారెడ్డి ఇంట్లోకి వెళ్లి.. బాలిక‌పై మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఊరి నుంచి తిరిగొచ్చిన బాలిక తల్లికి సమాచారమిచ్చింది.దీంతో ఆమె మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసు కేసు పెట్టార‌నే విష‌యం తెలుసుకున్న నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని, కేసు వెనక్కి తీసుకుకోలేని ప‌క్షంలో  మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరించాడు. 

తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్‌–జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. 


అతడి నుంచి రెండు నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్లు, కేసు వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, దీనికి మహిళ, బంధువు వేధింపులే కారణమంటూ పేర్లు రాస్తానని బెదిరించినట్టుగా వాట్సాప్‌ మెస్సేజ్‌ల వివరాలు, ద్విచక్ర వాహనం, మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అతనిపై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు,   SC/ST అట్రాసిటీ యాక్ట్,  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.

click me!