
సంగారెడ్డి : వరి ధాన్యాన్ని తన కల్లంలోనే కొనుగోలు చేయాలని విధుల్లో ఉన్న ప్రాథమిక agricultural cooperative society (పీఏసీఎస్) సీఈఓపై ఓ రైతు పెట్రోల్ పోశాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రైతులు, CEO కథనం ప్రకారం గ్రామానికి చెందిన గజ్జెల విఠల్ తన పొలంలో పండిన Rice grainన్ని కల్లంలోనే కుప్పగా పోశాడు. దగ్గరలోనే కొనుగోలు కేంద్రం ఉన్నప్పటికీ ధాన్యాన్ని అక్కడికి తీసుకు వెళ్ళకుండా కల్లంలోనే కొనుగోలు చేయాలని కల్హేర్ పీఏసీఎస్ సీఈఓ భాస్కర్ మీద కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు.
కేంద్రంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు వరుసక్రమంలో ఉన్నాయని, వాటిని ఆ ప్రకారమే కొంటున్నామని ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే తన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని సదరు రైతు ఓ రాజకీయ నాయకుడితోనూ సీఈవో కు చెప్పించాడు. అయినా కొనుగోలు చేయడం లేదనే కోపంతో ఆదివారం సాయంత్రం గోదాం వద్ద ఉన్న సీఈఓపై రైతు విఠల్ ఒక్కసారిగా సీసాలో తెచ్చిన పెట్రోల్ పోశాడు. ఈ ఘటనతో కంగుతిన్న భాస్కర్ వెంటనే తేరుకొని పెట్రోల్ తో తడిసిన దుస్తులు విప్పేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎక్సై ప్రశాంత్ తెలిపారు.
కాగా, రైతుల వద్ద నుంచి ధాన్యం తామే కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతనెలలో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వరి రారుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు రాస్ట్రాల సరిహద్దుల్లో 51 చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లుల దగ్గర స్పెషల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. వరి కొనుగోళ్ల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ వరికి రూ.1960 ధర ప్రకటించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకునేందుకు కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనబోమని రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని నిన్న మంత్రి గంగుల కమలాకర్ ముందే చెప్పారు.