రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల గుస్సా

First Published May 9, 2018, 3:59 PM IST
Highlights

గాంధీ భవన్ లో గరం గరం..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ మంగళవారం సంచలన కామెంట్స్ చేశారు. దీంతో రేవంత్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భగ్గుమంటున్నారు. సిఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తాజాగా మీడియాతో స్పందించారు. ఆయనేమన్నారో చదవండి.

పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి పైన రేవంత రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి కొద్దీ రోజుల క్రితమే వచ్చాడు. రేవంత్ రెడ్డి కి రాహుల్ దూతలు హామీ ఇచ్చారు అనేది కరెక్ట్ కాదు. పార్టీలో చేరే ముందు అన్ కండీషనల్ గా చేరతారు. రేవంత రెడ్డి నేను ఇచ్చే సలహా ఒక్కటే. రేవంత్ రెడ్డి పార్టీలో ఓపికగా ఎదురు చూడాలి. సమన్వయంతో ఉండాలి. పార్టీ కోర్ మీటింగ్ లో ఈ అంశాలన్నింటిపై చర్చ చేస్తాం త్వరలో.

కొంతమంది వ్యక్తులను కించపరిచేలాగా రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదు. తెలంగాణ ఉద్యమంలో  రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన చంద్రబాబు పక్కన ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంత? నేను నాయకుణ్ణి అని చెప్పుకోవద్దు. పార్టీ, ప్రజలు గుర్తిస్తారు. ప్రజల ఆశీర్వాదం కావాలంటే ప్రజల మేలు కోసం ప్రజా యజ్ఞం చేయాలి. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిందే నిన్న కాక మొన్న. అప్పుడే పెద్ద లీడర్ కావాలంటే ఎట్లా?

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికి కాంగ్రెస్ నాయకులు  సమన్వయ లోపంతో  అధికారంలోకి రాలేకపోయము. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీయే. పార్టీలోని నాయకులంతా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. పార్టీలో ఎవరైనా కార్యకర్తలు వేలెత్తి చూపే పనులు చేయవద్దు. బస్సు యాత్ర ద్వారా ప్రజలలో, కార్యకర్తలలో ఒక కొత్త ఊపు వచ్చింది. కానీ ఇంకా కొంత పోరాడాల్సిన అవసరం ఉంది. నేను పార్టీ మాత్రమే ముఖ్యం అని పనిచేసే వ్యక్తిని.

click me!