Janareddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల అధికారులు..

By Rajesh Karampoori  |  First Published Nov 13, 2023, 9:50 PM IST

Janareddy: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు(Telangana Assembly election) సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులందరూ ప్రచార కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Janareddy )కి  ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే... 
.. 


Janareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చోటా మోటా నాయకుల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యార్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదిలాఉంటే..మరోవైపు..నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో నిబంధనలు పాటించని వాటిని తొలగించని పలువురు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. వారి నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(jana reddy)కు షాక్ తగిలింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి  దాఖలు చేసిన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

Latest Videos

undefined

ఎన్నికల అధికారులు ప్రకారం.. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఏడుగురు అభ్యర్థుల నిబంధనలను సరిగా పాటించలేదనీ. వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అందులో  జానారెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. గత ఎన్నికలను మినహాయిస్తే దాదాపు ఓటమి ఎరుగని జానారెడ్డి నామినేషన్ ఎలా రిజెక్ట్ అయిందన్న దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు ఈ ఎన్నికలలో జానారెడ్డి కుమారుడు జయవీర్ కూడా  పోటీ చేసేందుకు నామినేషన్(nomination)దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి  నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారని, అందుకే జానారెడ్డి నామినేషన్ తిరస్కరించవచ్చని పలువురు భావిస్తున్నారు. జానారెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్‌కు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆయనకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాగే.. ఆయనకు భారీ ఫాలోయింగ్  ఉంది.. ఈ ఫాలోయింగ్ తో ఈ ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపిస్తారో? లేదో? వేచిచూడాలి

మరోవైపు.. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ నామినేషన్ రద్దు చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. పువ్వాడ అజయ్ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ లో తప్పులున్నాయని, ఆయన నామినేషన్లను తిరస్కరించాలని ఎన్నికల అధికారులకు కోరారు. అంతేకాదు.. ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

click me!