ప్రారంభమైన లష్కర్ బోనాలు: తొలి బోనం సమర్పించిన తలసాని

By narsimha lodeFirst Published Jul 21, 2019, 8:31 AM IST
Highlights

లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకొంటారు.

హైదరాబాద్:లష్కర్ బోనాలు ఆదివారం నాడు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఇవాళ ఉదయం అమ్మవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకొంటారు

ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకొంటారు.

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా వచ్చారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బోనాలను పురస్కరించుకొని నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. ఆది, సోమ వారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. మరో వైపు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్క్ చేసేందుకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.


 

click me!