వ్యక్తిని చంపి తలతో పోలీస్‌స్టేషన్ కు....

Published : Jul 21, 2019, 07:45 AM ISTUpdated : Jul 21, 2019, 11:46 AM IST
వ్యక్తిని చంపి తలతో పోలీస్‌స్టేషన్ కు....

సారాంశం

నల్గొండ జిల్లాలో దారుణం  చోటు చేసుకొంది. వ్యక్తిని చంపి తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఘటన నాంపల్లి మండలం నేరేళ్లపల్లిలో పాతకక్షలతో వ్యక్తిని చంపిన నిందితుడు తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  

నల్గొండ:నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. పాతకక్షలతో ఓ వ్యక్తిని హత్య చేసి అతని తలతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు.

నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి చెందిన సద్దాం అనే యువకుడిని గౌస్ అనే వ్యక్తి శనివారం నాడు హత్య చేశాడు. మృతుడి తలతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.

సద్దాం అదే గ్రామానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉండేవాడు. వీరిద్దిరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన సోదరి ఆత్మహత్య  చేసుకోవడానికి సద్దాం కారణమని గౌస్ భావించాడు.

సద్దాంను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. తన స్నేహితుడు ఇమ్రాన్ తో కలిసి సద్దాంను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సద్దాం తలను మొండెం నుండి వేరు చేసి పోలీసులకు లొంగిపోయాడు. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై నిందితులు సద్దాంను నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ