చంపేస్తామంటూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

Siva Kodati |  
Published : Apr 24, 2019, 08:44 PM IST
చంపేస్తామంటూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

సారాంశం

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. అంతు చూస్తానంటూ ఓ ఆగంతకుడు ఆయనను ఫోన్‌లో బెదిరించాడు. 

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. అంతు చూస్తానంటూ ఓ ఆగంతకుడు ఆయనను ఫోన్‌లో బెదిరించాడు. దీంతో ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అరబీక్, ఉర్దూ భాషలలో ఆగంతకులు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి షార్జా నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. తాజాగా మరోసారి ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.     

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్