తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పరిషత్ పోలింగ్

By Siva KodatiFirst Published May 10, 2019, 6:34 PM IST
Highlights

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 180 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 180 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్ధానాలు ఏకగ్రీవం కావడంతో 179 జడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ముగిసింది.

జడ్పీటీసీ స్థానాలకు 805, ఎంపీటీసీ స్థానాలకు 6 వేల మంది అభ్యర్ధులు బరిలోకి దిగారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 218 స్ధానాల్లో పోలింగ్ ప్రక్రియ 4 గంటలకే ముగిసింది.

మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల వరకు క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 69.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

click me!