హైదరాబాద్ లో ఈ జులైలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇలా నమోదవ్వడం 34 సంవత్సరాల్లో ఇది రెండోసారి అని తెలిపింది.
హైదరాబాద్ : హైదరాబాద్ లో వరుస వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. రుతుపవనాలు ప్రవేశించిన నాటినుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ ను వణికిస్తున్నాయి. ఇలాంటి వర్షాలు గత 34 సంవత్సరాలలో రెండోసారి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. మామూలుగా జూలై నెలలో 244.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాలి. కానీ ఈ యేడు అది 539.9 మిల్లీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. ఇలా అత్యధిక వర్షపాతం నమోదవడం 34 సంవత్సరాలలో రెండవది. మొదటిసారి 1988, జూలైలో 544.1మి.మీ. నమోదయ్యింది.
ఆదివారం నగరంలో భారీ వర్షాలు నమోదుకాలేదు. రోజంతా ఎండ కాస్తూనే ఉంది. అయితే సాయంత్రానికి కొన్ని చోట్ల వర్షం పడింది. నగరంలో ఆదివారం అంబర్‌పేటలో అత్యధికంగా 35.0 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 28.0, కూకట్‌పల్లిలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 5.9 మి.మీ కాగా 3.2 మి.మీ. నిర్మల్‌లో అత్యధికంగా 57.8 మి.మీ, సిద్దిపేటలో 54.3 మి.మీ, కొమరం భీమ్‌లో 53.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
undefined
శంషాబాద్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం, కాంగ్రెస్ నేత కుమార్తె మృతి...
రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, రాబోయే 48 గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని అంచనా. వర్షపాతం లేకుండా సాపేక్ష ఆర్ద్రత 80 శాతం ఉంటుందని అంచనా.