పరిశీలన పూర్తి.. సాగర్ బరిలో 60 మంది, నివేదిత రెడ్డి నామినేషన్ తిరస్కరణ

Siva Kodati |  
Published : Mar 31, 2021, 05:46 PM ISTUpdated : Mar 31, 2021, 05:47 PM IST
పరిశీలన పూర్తి.. సాగర్ బరిలో 60 మంది, నివేదిత రెడ్డి నామినేషన్ తిరస్కరణ

సారాంశం

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు  సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. బరిలో మొత్తం 60 మంది నిలిచారు. 17 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. నివేదిక రెడ్డితో పాటు మరో 16 మంది నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి.

ఉప ఎన్నికు సంబంధించి 78 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుండగా...మే 2న కౌంటింగ్ జరుగనుంది. 

Also Read:నాగార్జునసాగర్ బైపోల్: ఎన్నికల ప్రచారానికి జానారెడ్డి, నోముల సెంటిమెంట్

గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన నియోజకవర్త ఇంఛార్జ్ కంకనాల నివేదితా రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అయితే ఆ తర్వాత డాక్టర్ రవికుమార్‌ను బీజేపీ అధిష్టానం అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

ఇకపోతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ తరపున దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్, టీడీపీ తరపున మొవ్వా అరుణ్ కుమార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే