తెలంగాణలో మళ్లీ బడిగంటలు: జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభం, కేబినెట్ గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Jun 19, 2021, 4:07 PM IST
Highlights

తెలంగాణలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని వెల్లడించింది. మాస్క్, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. 
 

తెలంగాణలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని వెల్లడించింది. మాస్క్, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. 

అంతకుముందు తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత.. కేసీఆర్ కీలక నిర్ణయం, తేలని అంతర్రాష్ట్ర సర్వీసుల అంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. లాక్‌డౌన్, గోదావరిలో నీటి ఎత్తిపోత, వానాకాలం సాగుపై మంత్రివర్గం చర్చించనుంది. జూన్ 8న సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయనం తీసుకుంది. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపు వుండేది. అనంతరం మేనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.

అయితే గత నెల చివర్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్‌ను జూన్ 9వ తేదీకి పొడిగించింది. అయితే లాక్‌డౌన్ సడలింపులను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇచ్చారు. జూన్ 8 నాటి కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను పది రోజుల పాటు పొడిగించడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. అలాగే ఇళ్లకి వెళ్లేందుకు మరో గంట సమయం అదనంగా ఇచ్చింది. నేటితో లాక్‌డౌన్ పొడిగింపు గడువు ముగియనుండటంతో దీనిపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది. 
 

click me!