Asianet News TeluguAsianet News Telugu

మసాజ్ పేరుతో వల.. వ్యభిచారం గుట్టురట్టు

హైదరాబాద్ లో వ్యభిచార ముఠా అడ్డంగా దొరికిపోయింది. హైరాబాద్ లో ఇలాంటి కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న తరుణంలో వ్యభిచార ముఠా రెడ్ హ్యాండెడ్ గా దొరకడం హాట్ టాపిక్ గా మారింది. కేపీహెచ్ బి కాలనిలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒక స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు కనుగొన్నారు.

prostitution gang arrested in hyderabad
Author
Hyderabad, First Published Jan 27, 2020, 2:22 PM IST

మరోసారి హైదరాబాద్ లో వ్యభిచార ముఠా అడ్డంగా దొరికిపోయింది. హైరాబాద్ లో ఇలాంటి కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న తరుణంలో వ్యభిచార ముఠా రెడ్ హ్యాండెడ్ గా దొరకడం హాట్ టాపిక్ గా మారింది. కేపీహెచ్ బి కాలనిలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒక స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు కనుగొన్నారు.

ఈ తనిఖీల్లో ఆరుగురు యువతులను పోలీసులు రెస్క్యూహోమ్‌కు తరలించారు. అసలు వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌–1లోని ఎమ్‌ఐజీ–59లోని ఫ్లాట్‌ నంబర్‌–202లో గత కొంత కాలంగా యూనివర్సల్‌ హెయిర్‌ అండ్‌ స్పా నిర్వహిస్తున్నారు. అయితే మసాజ్ పేరుతో ఆన్లైన్ లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.  భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు వెంటనే ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.36లక్షలకు పైగా నగదుతో పాటు 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసి కోర్టు ఏడుత హాజరుపరిచారు.

--

జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం చేయిస్తున్న దర్శకుడి అరెస్టు

ముంబై: ఓ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ గుట్టును సోషల్ సర్వీస్ బ్రాంచ్ కు చెందిన ముంబై పోలీసులు రట్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ కుమార్ ప్రేమ్ లాల్ ఆర్య (32) పలు హిందీ సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

మిత్రులు అజయ్ శర్మ, విజయ్ లతో కలిసి గత ఐదేళ్లుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

విటుల్లా పోలీసులు నవీన్ కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలంటూ ఆడిగారు. తాను సినీ పరిశ్రమకు చంెదిన ఇద్దరిని పంపిస్తున్నట్లు నవీన్ వారికి చెప్పారు. ఒక్కో మహిళకు రూ.60 వేలు చెల్లించాలని, హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పాడు. 

పోలీసు వలకు చిక్కిన నవీన్ అమ్మాయిలతో కలిసి హోటల్ కు వచ్చాడు. అలా నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల వాంగ్మూలాలను నమోదు చేసుకుని వారిని హోంకు పంపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios