మళ్లీ తెలంగాణలోనే: ఊడిన స్కూలు బస్సు చక్రాలు.. బస్సులో 60 మంది చిన్నారులు

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 08:52 AM IST
మళ్లీ తెలంగాణలోనే: ఊడిన స్కూలు బస్సు చక్రాలు.. బస్సులో  60 మంది చిన్నారులు

సారాంశం

తెలంగాణను బస్సు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని సెయింట్ మేరీస్ హైస్కూలు బస్సు ప్రతి రోజు మాదిరిగా 60 మంది విద్యార్థులను ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరింది.

ఈ క్రమంలో బొడ్లాడ గ్రామ సమీపంలో అదుపుతప్పి పక్కనేవున్న పెద్ద బండను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఊడి దెబ్బతిన్నది. డ్రైవర్, క్లీనర్ సహా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు బస్సులో నుంచి విద్యార్థులను సురక్షితంగా కిందకు దించారు.

గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch
రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు