యాదాద్రి జిల్లాలో వాగులో స్కూటీ సహా ఇద్దరు యువతుల గల్లంతు: గాలింపు చేపట్టిన పోలీసులు

Published : Aug 30, 2021, 03:51 PM ISTUpdated : Aug 30, 2021, 05:47 PM IST
యాదాద్రి జిల్లాలో వాగులో స్కూటీ సహా ఇద్దరు యువతుల గల్లంతు: గాలింపు చేపట్టిన పోలీసులు

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో స్కూటీ చిక్కుకొని ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. రాజపేట మండలం దోసలవాగు వద్ద ఓ ఘటన చోటు చేసుకొంది.  వరద ప్రవాహన్ని తక్కువగా అంచనావేసి వెళ్లడం ద్వారా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.


భువనగరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో  వాగులో స్కూటీ  చిక్కుకొని ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. గల్లంతైన యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

also read:వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

అయితే వరద నీటిలో స్కూటీ నిలిచిపోయింది. వరధ ఉధృతికి స్కూటీ సహా ఇద్దరు యువతులు  కొట్టుకుపోయారు.వరదలో కొట్టుకుపోయిన వారిని హిమబింధు, సింధూజలుగా గుర్తించారు. సుమారు వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి.  ఆదివారం నాడు కూడ రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో  వాగుల్లో వరద  ప్రవాహం ఎక్కువైంది.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం