ఆ ప్యాకేజీ తెచ్చి ఓట్లు అడగాలి, ఈటల గెలిస్తే ఏం ఉపయోగం: బీజేపీపై హరీష్ రావు ఫైర్

By narsimha lodeFirst Published Aug 30, 2021, 3:22 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో విజయం సాధిస్తే  ఏం ఉపయోగమని  తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గెల్లుశ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్‌ అభివృద్దికి మలుపుగా మారుతోందని ఆయన చెప్పారు.
 


హుజూరాబాద్:  ఈటల రాజేందర్ గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు ఏం ఉపయోగమని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ గెలిస్తే వ్యక్తిగతంగా ఆయనకు, బీజేపీకి లాభమని ఆయన చెప్పారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని హరీష్ రావు ఈ నియోజకవర్గంలో  విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్  విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. 

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ అభివృద్దికి  మలుపు అని మంత్రి హరీష్ రావు చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. వీణవంకలో కనీసం రూ. 10 లక్షల పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు.

హుజూరాబాద్ అభివృద్ది కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి రావాలని ఆయన సూచించారు. రూ. 5 వేల  కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ నేతలు హుజూరాబాద్ లో ఓట్లు అడగాలని ఆయన కోరారు. నోట్ల రద్దుతో  అవినీతి ధనం ఎంతో లెక్క తేల్చారా అని ఆయన ప్రశ్నించారు. 

click me!