BRS: మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. మున్సిపల్ చైర్‌పర్సన్ ఫిర్యాదు

By Mahesh K  |  First Published Dec 27, 2023, 12:30 AM IST

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, మరికొందరిపై మున్సిపల్ చైర్‌పర్సన్ వేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు 2019 ఎన్నికల సమయానికి చెందినది కావడం గమనార్హం.
 


Hyderabad: బీఆర్ఎస్ లీడర్, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ స్రవంతి ఫిర్యాదుతో ఈయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితోపాటు ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్‌లపై కేసు ఫైల్ అయింది.

2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రూ. 2.5 కోట్లు లంచం తీసుకున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ కప్పరి స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తాను బుడగ జంగాల సామాజికవర్గానికి చెందిన మహిళను. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎంపికైన దగ్గరి నుంచి తనను కులం పేరుతో మాజీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు వేధిస్తున్నారని స్రవంతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Latest Videos

Also Read: రేపల్లే వైసీపీ ఇంచార్జీ మార్పు.. ఆయనను అంత సింపుల్‌గా వదులుకోను: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మాజీ మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, అప్పటి వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలనే కుట్రతో తనను సెలవులు పెట్టాలని నిత్యం వేధించారని కప్పరి స్రవంతి పేర్కొన్నారు. ఈ వేధింపు ఇక్కడికే పరిమితం కాలేవని వివరించారు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ సైతం తనది తక్కువ కులం కాబట్టి, ఎక్కువ కులాల వారితో పెట్టుకోవద్దని సూచనలు ఇచ్చారని తెలిపారు. అంతేకాదు, ఒక వేళ తాను సెలవు పెట్టకుంటే సస్పెండ్ చేస్తానని అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ సైతం వార్నింగ్ ఇచ్చాడని వివరించారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్ పై పోలీసులు కేసు పెట్టారు.

కప్పరి స్రవంతి తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం గమనార్హం.

click me!