మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శ్రుతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. కారణమిదే..

By Sumanth Kanukula  |  First Published Feb 9, 2022, 4:49 PM IST

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna) కూతురు శ్రుతి రెడ్డిపై (Shruthi Reddy) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డితో పాటుగా, వినోదా కైలస్‌లపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna) కూతురు శ్రుతి రెడ్డిపై (Shruthi Reddy) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డితో పాటుగా, వినోదా కైలస్‌లపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలీషా బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వారిద్దరిపై ఐపీసీ 323,336,341,384,448,506 R/W 34…..SC, ST, POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

బంజారాహిల్స్‌లో వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (Potluri Vara Prasad) ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమతో శ్రుతి రెడ్డి వాగ్వాదానికి దిగారని, అసభ్య పదజాలంతో దూషించారని ఎలీషా బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శృతిరెడ్డితో పాటు, వినోదా కైలాస్‌లపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేవారు. 

Latest Videos

కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో పీవీపీ, శ్రుతిరెడ్డి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.  తన ఇంటిపైకి పీవీపీ మనుషులకు పంపారని డీకే శ్రుతి తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై స్పందించిన పీవీపీ.. గతంలో కోర్టు పరిధిలో కేసు ఉందని, ఇప్పుడు కోర్టు ఆర్డర్ తోనే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నమని చెప్పారు. ఈ మేరకు కోర్టు ఆర్డర్ కాపీ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశామన్నారు. పీవీపీ అనుచరుల ఫిర్యాదు మేరకు శృతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!