కరెంట్ షాక్ కొట్టి మరణించిన దీక్షిత కుటుంబానికి... సత్యవతి రాథోడ్ పరామర్శ, ఆర్థిక సాయం (వీడియో)

By AN Telugu  |  First Published Sep 29, 2021, 2:10 PM IST

దీక్షిత ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతికి  విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్వాడి టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయం అందించారు. 

గులాబ్ తుఫాన్ (gulab cyclone) కారణంగా వరుస వర్షాల వల్ల తెగిన కరెంట్ వైర్ తగలడంతో షాక్ (Current Shock) కొట్టి మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమరి దీక్షిత(dixita)(16) చనిపోయింది. ఆమె కుటుంబాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్  నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. 

"

Latest Videos

దీక్షిత ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతికి  విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్వాడి టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయం అందించారు. 

అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.
 
click me!