అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇలాంటి చర్యా?.. కవితకు నోటీసులపై మండిపడ్డ సత్యవతి రాథోడ్..

Published : Mar 08, 2023, 11:01 AM IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇలాంటి చర్యా?.. కవితకు నోటీసులపై మండిపడ్డ సత్యవతి రాథోడ్..

సారాంశం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ చిన్న అనుమానంతో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. 

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు రావడంపై గిరిజనసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు తెలపాల్సింది పోయి.. ఇలా బిహేవ్ చేయడం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎంత ప్రయత్నించినా, ఎంత వేధించాలని చూసినా కవిత భయపడదన్నారు.  

ఆమెను మీ కేసులు, సమన్లు ఏం చేయలేవన్నారు. కవిత చాలా గట్టిందని తెలిపారు. దేనికీ భయపడదని.. కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే అది మీ విఫల ప్రయత్నమే అని అన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్న అదానీ, ప్రధానితో కుమ్మక్యతై ఏమీ లేదు కానీ.. వందకోట్ల రూ. స్కాం అనే అనుమానం పేరుతో కవితను వేధించడం ఖండిస్తున్నాం. ఈడీ నోటీసులు, సమన్లు ఇవ్వడం అన్యాయం అన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

తెలంగాణ తలవంచదు, విచారణకు సహకరిస్తా: ఈడీ నోటీసులపై కవిత

కాగా, ఈడీ నోటీసుల మీద ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీకి అన్నిరకాలుగా తాను సహకరిస్తానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కవితకు ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉన్నందున తాను హాజరు కాలేనని తెలిపారామె. కానీ, అది ఎల్లుండి కాబట్టి, రేపు హాజరు కావాలని ఈడీ అధికారులు అన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనకు ఈడీ నోటీసులు అందినట్లు కవిత ఒప్పుకున్నారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ మార్చి 9న విచారణకు హాజరుకావాలంటూ  సమన్లు ​​జారీ చేసింది. ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. తాను కవితకు బినామీని అని రామచంద్ర పిళ్లై చెప్పినట్లు ఈడి తెలిపింది. దీంతో ఢిల్లీలో విచారణకు రావాలని ఈడి చెప్పింది. నిన్న అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్లైను ఈడి దాదాపు 80సార్లు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈడి నోటీసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు అరెస్ట్ అయిన గోరంట్ల బుచ్చిబాబు కొంత కాలం కవితకు ఆడిటర్ గా పనిచేశాడు

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.